తెలంగాణ

telangana

ETV Bharat / city

'ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు'.. వైకాపా ఎంపీ సంచలన వ్యాఖ్యలు - ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతోందన్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

MP Pilli Subhash Chandra Bose: ధాన్యం కొనుగోళ్లలో రైతులు దోపిడీకి గురవుతున్నారని.. వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతోందన్న ఆయన.. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 17 వేల మంది రైతులను ఆధార్ లింక్ చేయకుండా రైస్ మిల్లుల యజమానులు, అధికారుల మోసం చేశారని చెప్పారు. తన వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. దీనిపై సీఐడీ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.

MP Pilli Subhash Chandra Bose comments
వైకాపా ఎంపీ పిల్లి సుభాష్​

By

Published : May 19, 2022, 5:05 PM IST

MP Pilli Subhash Chandra Bose: ఏపీలో ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 17వేల మంది రైతుల ఆధార్ లింక్ చేయకుండా రైస్ మిల్లుల యజమానులు, అధికారులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ కోరతానని వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లను సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే క్షేత్రస్థాయిలో కొందరు రైతులకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సన్న, చిన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే ప్రజాప్రతినిధులు చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. ఈ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు: వైకాపా ఎంపీ

"ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి జగన్​.. ప్రతిరోజు వివరాలు సేకరిస్తున్నా.. అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఒక రైతుకు నాలుగెకరాల భూమి ఉంటే.. రెండెకరాలకు మాత్రమే డబ్బులు పడుతున్నాయి. మిగతాది వేరే వ్యక్తుల పేర్లమీద నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయలేక రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకుంటున్నారు. రైతుల భూములకు సంబంధించి ఈ ట్యాపింగ్​లో గోల్​మాల్​ జరుగుతోంది. ఈ కుంభకోణంపై సీబీసీఐడీ విచారణ జరిపించాలి." -పిల్లి సుభాష్​ చంద్రబోస్​, వైకాపా ఎంపీ

బోస్ చెప్పింది అక్షరసత్యం - సోమిరెడ్డి :ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైకాపా ఎంపీ బోస్ చెప్పింది అక్షరసత్యమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోనసీమలోనే కాదు నెల్లూరులో బస్తాకు 300 రూపాయలకు పైగా దోచేశారని ఆయన ఆరోపించారు. వైకాపా నేతలు, దళారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పుట్టి ముంచేశారని మండిపడ్డారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఒక్క నెల్లూరులోనే 3 వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఈ స్కామ్​పై సీఐడీ కాదు సీబీఐ లేదా జ్యూడిషియల్ విచారణ జరిపితేనే నిజాలు నిగ్గుతేలుతాయని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:తెరాసకు షాక్‌... కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే దంపతులు

కుప్పకూలిన స్టాక్​మార్కెట్లు.. సెన్సెక్స్​ 1400 మైనస్​.. మరి ఎల్​ఐసీ సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details