తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా - తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా

వైకాపా ఎమ్మెల్యే రోజా... ఏపీలోని తిరుమలలో తితిదే నిబంధనలు ఉల్లంఘించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండపైకి వచ్చిన ఆమె కారులో వైకాపా జెండా, పార్టీ నాయకుల ఫోటోలతో కూడిన కరపత్రాలు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

ycp-mla-roja-violated-the-rules-in-tirumala ap
తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా

By

Published : Aug 3, 2020, 6:45 PM IST

వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజా.. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో శ్రీవారిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో ఆమె కారులో వైకాపా జెండా, పార్టీ నాయకుల ఫోటోలతో కూడిన కరపత్రాలు ఉన్నాయి.

రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి వస్తువులు కొండపైకి తీసుకురాకూడదు. నిబంధనలు అతిక్రమించారని ఎమ్మెల్యే రోజాపై విమర్శలు వస్తున్నాయి. ఆమె కారును భద్రతా సిబ్బంది తనిఖీ చేయకుండానే ఎలా అనుమతించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా

ఇదీ చదవండి:సోదరీసోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు సంకేతం రాఖీ: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details