వరవరరావు విషయంలో భాజపా ఏపీ బాధ్యుడు సునీల్ దియోధర్ వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదన్న భూమన.. 81 ఏళ్ల వరవరరావుపై జాలి చూపమనే కోరానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్తోనే ప్రారంభమైందని... వెంకయ్యనాయుడు, వరవరరావుతో కలిసి జైలులో ఉన్నానని గుర్తు చేశారు. అందుకే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశానని వివరణ ఇచ్చారు భూమన. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెట్టడం బాధించిందని భూమన అన్నారు.
వరవరరావుపై తనది వ్యక్తిగత అభిప్రాయం: తిరుపతి ఎమ్మెల్యే భూమన - భూమన కరుణాకర్ రెడ్డి
వరవరరావు విషయంలో భాజపా ఏపీ బాధ్యుడు సునీల్ దియోధర్ వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. వరవరరావుపై జాలి చూపమని కోరానని...అది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు.
వరవరరావుపై తనది వ్యక్తిగత అభిప్రాయం: తిరుపతి ఎమ్మెల్యే భూమన