తెలంగాణతో జలవివాదాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Sajjala : 'సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి సిద్ధం' - water conflict
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదాలపై కొందరు తెలంగాణ నేతల వ్యాఖ్యలు పరుషంగా ఉన్నాయని.. వైకాపా నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala ramakrishna reddy) అన్నారు. ఇలా మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.
sajjala on water disputes
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదన్న సజ్జల... సీఎం కేసీఆర్‌తో కలిసి చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ (jagan) మాత్రం సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. పరుషంగా మాట్లాడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
ఇదీచూడండి:Minister Vemula: రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని తేలిపోయింది: ప్రశాంత్‌రెడ్డి