తెలంగాణ

telangana

ETV Bharat / city

తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి - కొత్తపల్లి సుబ్బారాయుడు వార్తలు

kottapalli subbarayudu : ముదునూరి ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించిందుకు బాధ పడుతున్నాంటూ వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంలో నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.

kottapalli subbarayudu
kottapalli subbarayudu

By

Published : Mar 2, 2022, 5:22 PM IST

kottapalli subbarayudu: నరసాపురం జిల్లా కేంద్ర సాధనలో ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించిందుకు బాధ పడుతున్నాంటూ.. చెప్పుతో తనని తాను కొట్టుకున్నారు.

జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ నరసాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో సభ నిర్వహించారు. జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మోసం చేశారని సుబ్బారాయుడు విమర్శించారు.

జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేలా కృషి చేయకుండా ప్రజలను ప్రసాదరాజు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ షరీఫ్, తెలుగుదేశం నేతలు మాధవనాయుడు, రామరాజు, జనసేన నేతలు బొమ్మిడి నాయకర్, ప్రకాష్ పాల్గొన్నారు.

తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి

ఇదీ చదవండి:స్థిరాస్తి వ్యాపారుల హత్య కేసు దర్యాప్తు ముమ్మరం.. ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా..

ABOUT THE AUTHOR

...view details