ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సంఘం వైకాపా సొంతమైంది. ఇక్కడి 31 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. ప్రత్యర్థుల నామినేషన్లు లేకపోవటంతో పుంగనూరు పురపాలక సంఘం వైకాపాకి ఏకగ్రీవమైంది. పలమనేరు పురపాలక సంఘంలోని 26 వార్డుల్లో 18 వార్డులు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
ఏపీ పుర పోరు: పుంగనూరు పురపాలికలో వైకాపా ఏకగ్రీవం - ఏపీలో పురపాలిక ఎన్నికలు
ఏపీలోని పుంగనూరు పురపాలక సంఘం వైకాపా సొంతమైంది. ఇక్కడ ఉన్న 31 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్యర్థుల నామినేషన్లు లేకపోవటంతో ఈ పురపాలిక సంఘం ఏకగ్రీవమైంది.
![ఏపీ పుర పోరు: పుంగనూరు పురపాలికలో వైకాపా ఏకగ్రీవం ap muncipal elections 2021 news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10854997-848-10854997-1614770723371.jpg)
ap muncipal elections 2021 news
8 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. నగరి పురపాలక సంఘం పరిధిలోని 29 వార్డుల్లో 7వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 6వార్డులు వైకాపా అభ్యర్థులు, 1వార్డు తెదేపా అభ్యర్ధికి ఏకగ్రీవమైంది. మిగిలిన 22వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.