Yashwant Sinha Campaign : జులై 2న హైదరాబాద్‌కు యశ్వంత్ సిన్హా.. కేసీఆర్‌తో భేటీ! - Yashwant Sinha campaign in Hyderabad
Yashwant Sinha Visit to Hyderabad : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 2 తారీఖున హైదరాబాద్ వస్తున్నారు. తనకు మద్దతిస్తున్న తెరాస, కాంగ్రెస్, మజ్లిస్ ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమవుతారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ వచ్చే నెల 2న హైదరాబాద్ వస్తున్నారు. అదేరోజు యశ్వంత్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Yashwant Sinha Campaign
By
Published : Jun 30, 2022, 7:04 AM IST
Yashwant Sinha Visit to Hyderabad : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 2న హైదరాబాద్ వస్తున్నారు. తనకు మద్దతు ఇస్తున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కాంగ్రెస్, మజ్లిస్ ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమవుతారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
Yashwant Sinha Election Campaign : అనంతరం ఖైరతాబాద్‌లోని జలవిహార్‌లో తెరాస నేతలతో సమావేశమవుతారు. సీఎం, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు. తర్వాత కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ప్రజాప్రతినిధులను కలుస్తారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ వచ్చే నెల 2న హైదరాబాద్ వస్తున్నారు. అదేరోజు యశ్వంత్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఘన స్వాగతం పలకాలని కేసీఆర్ ఆదేశం..బేగంపేట విమానాశ్రయంలో యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం పలకాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సిన్హాకు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులపై తెరాస భారీగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనుంది. విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల ప్రచార కమిటీలో సభ్యుడైన తెరాస ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి.. యశ్వంత్ పర్యటన సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అప్పుడు మోదీ చెప్పింది అబద్ధమేనా : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ బుధవారం ట్విటర్‌లో విమర్శించారు. ‘‘దేశంలోని అన్ని గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తయిందని మోదీ 2018 ఏప్రిల్‌లో స్వయంగా వెల్లడించారు. కానీ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గ్రామానికి ఈ నెల 25న కరెంటు సౌకర్యం వచ్చింది. మరి ఆయన 2018లో చెప్పింది అబద్దమేగా? భాజపా మార్క్ అబద్దాలతో మోదీ దేశప్రజలను ఎన్ని సార్లు మోసం చేస్తారు?’’ అని కేటీఆర్ ట్విటర్‌లో విమర్శించారు.