ప్రజాస్వామ్య నియంతల నియంత్రణకు శాసన మండలి... శాశ్వతసభగా ఉండాలని తెదేపా సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ఎగువ సభలు కీలకమన్నారు. రాజ్యసభ శాశ్వతసభగా ఉన్నప్పుడు మండలి కూడా శాశ్వతంగా ఉండడమే సరైందన్నారు. కేంద్రం ఈమేరకు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు.
'నియంతలను నియంత్రించేందుకు.. మండలి ఉండాలి' - andhra pradesh latest news
శాసన మండలి విషయంలో... ప్రభుత్వ వ్యవహార శైలిని మండలిలో ప్రతిపక్ష నేత యనమల తప్పుబట్టారు. మండలి శాశ్వతంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
'నియంతలను నియంత్రించేందుకు.. మండలి శాశ్వతంగా ఉండాలి'
దిగువ సభకు వెళ్లలేని వర్గాలు, ఎగువ సభకు వెళ్లే అవకాశం ఉందన్నారు. "ప్రజాస్వామ్య నియంతలా మారిన జగన్ వంటి వారి కట్టడికి మండలి ఉండాలి" అని వ్యాఖ్యానించిన యనమల.. న్యాయమూర్తులపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని, పొలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైకాపా నేతల తీరును తప్పుబట్టారు.