తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సీఎంపై యనమల విమర్శల వర్షం - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ

ఏపీ సీఎం జగన్ పై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. తన చేతికి మట్టి అంటకుండా విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారని ఆరోపించారు.

yanamala-ramakrishnudu-fiers-on-cm-jagan-over-vizag-steel-privatisation
ఏపీ సీఎంపై యనమల విమర్శల వర్షం

By

Published : Feb 19, 2021, 5:24 PM IST

ఏపీ సీఎం జగన్ పై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శల వర్షం కురిపించారు. "విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని తమ చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించి తన బినామీల పరం చేయాలన్నదే జగన్నాటకం" అని.. యనమల ఆరోపించారు. నేరం తనది కాదు.. తన బినామీల భూదాహానిది అనే రీతిలో జగన్‌ వ్యవహరిస్తున్నారని.. మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ భూముల్ని తన బినామీలకు కట్టబెట్టే రహస్య అజెండాలో భాగంగానే జగన్‌ ప్రధానికి లేఖ రాశారని మండిపడ్డారు.

సూత్రధారులు..పాత్రధారులు..

ఏ1 జగన్‌, ‌ఏ2 విజయసాయిరెడ్డిలే అమ్మకం కుట్రలో సూత్రధారులు అయితే.. పాత్రధారులు అరబిందో, హెటిరో అని దుయ్యబట్టారు. కాకినాడ సెజ్, బేపార్క్ భూములను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారన్న యనమల... తొలుత విశాఖ భూములు, ఆశ్రమ భూములపై గద్దల్లా వాలి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూములపైనే కన్నేశారని ఆరోపించారు. సీఎం మాటలను బట్టే పోస్కోతో ఒప్పందం నిజమేనని తెలుస్తోందన్నారు.

ఉక్కు కర్మాగారానికి ఇచ్చిన భూముల అమ్మకం చట్టపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఎకరా రూ. 3 కోట్లు విలువ చేసే ఈ భూముల ప్రయోజనం స్థానికులకే దక్కాలి తప్ప జగన్ బినామీల పరం కారాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి తమ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కార్మిక సంఘాలు కోరుతుంటే... వారిని పట్టించుకోకుండా యాగానికి వెళ్లటం ఎంతవరకు సబబని నిలదీశారు.

ఇదీ చదవండి:'అమిత్‌ షా'కు బంగాల్‌ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు

ABOUT THE AUTHOR

...view details