తెలంగాణ

telangana

ETV Bharat / city

14 రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా: మల్లాడి కృష్ణారావు - యానాం తాజా వార్తలు

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుతోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఫలితంగా పుదుచ్చేరిలోని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. మెజారిటీ కోల్పోయే పరిస్థితి నెలకొంది.

yanam mla
14 రోజుల్లో సంచలన విషయాలు వెల్లడిస్తా: మల్లాడి కృష్ణారావు

By

Published : Feb 16, 2021, 4:25 PM IST

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. 30 మంది సభ్యులు ఉండగా 15 మంది కాంగ్రెస్.. ముగ్గురు డీఎంకే సభ్యులతో 2016 జూన్ 6న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీలో సీనియర్ మంత్రులు, శాసనసభ్యులైన నలుగురు పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయే పరిస్థితిలో ఉంది. అదే కోవలో తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాం శాసనసభ్యుడు మల్లాడి కృష్ణారావు ఆరోగ్యశాఖ మంత్రి పదవికి... శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల యానాంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది.

యానాం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తా..

'తన నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల పాటు ప్రజల్లో ఒకరిగా ఉండి.. ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీకి సిద్ధమయ్యానని.. తన సేవలు గుర్తించి ఐదు పర్యాయాలు తనను ఎన్నుకుంటూ వచ్చారని మల్లాడి తెలిపారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తన కుమారుడు గాని, భార్య గాని ఏ రోజు ప్రజలకు సేవలు చేసిన పరిస్థితులు లేవని.. అలాంటప్పుడు వారిని తదుపరి నేతగా ప్రజలు ఏ రకంగా అంగీకరిస్తారు అని ప్రశ్నించారు. రాజకీయం అనేది వారసత్వం కారాదనే దానికే కట్టుబడి ఉంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీలో గెలిచేందుకు కొంతమంది ధన బలంతో ముందుకు వస్తున్నారని... గత ఎన్నికల్లో ఏనాడు ఓటర్లు.. డబ్బుకు అమ్ముడు పోలేదని .. తాను పోటీలో లేకున్నా ఆ సంస్కృతిని యానాంలోకి ఎట్టి పరిస్థితిలోనూ రానీయనన్నారు. యానాం ప్రజల సంక్షేమం, పర్యాటక అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తూనే ఉంటానని... రానున్న 14 రోజుల్లో యానాం ప్రజలకు సంచలనాత్మకమైన విషయాలు చెబుతానని'' మల్లాడి అన్నారు.

ఇవీచూడండి:పుదుచ్చేరి ప్రభుత్వానికి 'రాజీనామా' సెగ

ABOUT THE AUTHOR

...view details