తెలుగు భాషను కాపాడుకుందాం.... స్వాభిమానాన్ని చాటుకుందాం. అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ఈ మహాసభలకు దేశవిదేశాల నుంచి భాషాభిమానులు, సాహితీవేత్తలు, రచయితలు తరలిరానున్నారు. కృష్ణాజిల్లా తెలుగు రచయితల మొదటి మహాసభలు 2007లో విజయవాడ కేంద్రంగా జరగ్గా.... అప్పుడే ప్రపంచ స్థాయి తెలుగు రచయితల సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఆ తర్వాత 2011లో రెండో మహాసభలు విజయవాడలోనే నిర్వహించి... ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2015లో మూడో మహాసభలనూ ఇక్కడే నిర్వహించారు. ప్రపంచంలోని సాహిత్యాభిమానులైన తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి భాషా వికాసానికి కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సారి నాలుగో మహాసభలను నిర్వహిస్తున్నారు.
తెలుగు రుచులతో విందు