ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుడి మహాక్షేత్ర సన్నిధిలోని అన్నపూర్ణ అమ్మవారి మందిరంలో అన్నపూర్ణ మహా వ్రతం 17 రోజుల నుంచి మహిళలు నిష్ఠగా ఆచరించారు. ఒకపూట భోజనంతో దీక్ష చేసిన సుహాసినీలంతా అమ్మవారి పాదాల దగ్గర దీక్ష విరమణ చేశారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, మిఠాయిలు సమర్పించారు.
కాశీలో అన్నపూర్ణ అమ్మవారి దీక్ష విరమించిన మహిళలు - womens retired from Annapurna Ammavari Deeksha
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుడి మహాక్షేత్ర సన్నిధిలోని అన్నపూర్ణ అమ్మవారి మందిరంలో ఒకపూట భోజనంతో దీక్షచేసిన సుహాసినీలంతా దీక్ష విరమణ చేశారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్, మిఠాయిలు సమర్పించారు. రైతులు కొత్త ధాన్యాన్ని మొట్టమొదటగా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
కాశీలో అన్నపూర్ణ అమ్మవారి దీక్ష విరమించిన మహిళలు
వ్రతం పూర్తయిన సందర్భంగా రైతులు కొత్త ధాన్యాన్ని మొట్టమొదటిగా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి గర్భగుడి సహా మందిరం మొత్తాన్ని కొత్త ధాన్యంతో అలంకరించారు. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమాన్ని మందిరం మహంత్ శ్రీ రామేశ్వర పూరి, శ్రీ శ్రీ శంకర్ పూరి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ అమ్మవారి సేవలో తరించింది.