Minister Buggana: 'గడప గడపకూ మన ప్రభుత్వం' పేరిట జనంలోకి వెళుతున్న మంత్రులకు.. సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉగాది నుంచి ఉపాధి హామీ డబ్బులు రావట్లేదని ఏపీలోని నంద్యాల జిల్లాలో ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి మహిళలు మొర పెట్టుకున్నారు. బేతంచర్ల మండలం హెచ్.కొట్టాలలో మంత్రి బుగ్గన పర్యటించిన.. 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ డబ్బులపై అధికారిని ప్రశ్నించిన మంత్రి బుగ్గన... వారంలో డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు.
మంత్రికి స్వాగతం పలికిన సమస్యలు.. 'ఉపాధి హామీ డబ్బులెప్పుడొస్తాయో చెప్పండి?' - నంద్యాలలో మంత్రి బుగ్గన పర్యటన
Minister Buggana: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గనకు సమస్యలు స్వాగతం పలికాయి. 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమానికి వచ్చిన మంత్రిని మహిళలు అడ్డుకుని.. తమ మొర చెప్పుకున్నారు. రెండు నెలలుగా ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని.. ఇళ్లు మంజూరు చేయడం లేదని మంత్రి ముందు మహిళలు వాపోయారు. వారంలోగా సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మంత్రికి స్వాగతం పలికిన సమస్యలు.. 'ఉపాధి హామీ డబ్బులెప్పుడొస్తాయో చెప్పండి?'