దేశంలో బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌కు తగినంత ఆదరణ దక్కట్లేదని... ఆ విధానంలో మార్పు రావాలని ప్రముఖ బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్లు సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేడియంలో రెడ్‌బుల్ షటిల్ అప్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మహిళల డబుల్స్ టోర్నీ ఫైనల్ పోటీలకు వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రెడ్‌బుల్ షటిల్ మహిళా డబుల్స్ టోర్నీ యువ క్రీడాకారిణిలకు మంచి వేదిక అని సిక్కిరెడ్డి పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భారత మహిళల డబుల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.తమను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది మహిళలు డబుల్స్ టోర్నీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.