తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్కడి ఆ ఐదురోజులు మహిళలు దుస్తులేసుకోరట!

కొన్ని ప్రాంతాల్లోని అలవాట్లూ, ఆహార పద్ధతులూ, నమ్మకాలను చూస్తే భలే విచిత్రంగా అనిపిస్తుంది. పర్యటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో కూడా అలా ఓ వింత ఆచారమే ఉంది. ఆ ఆచారం ఎంటో తెలసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Himachal Pradesh state pini village latest news
Himachal Pradesh state pini village latest news

By

Published : Jun 15, 2020, 7:28 AM IST

హిమాచల్‌ప్రదేశ్‌లోని పిని ఆ గ్రామంలోని మహిళలు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. మహిళలు ఏడాదిలో ఐదురోజులపాటు బట్టలు వేసుకోరు. పైగా ఆ రోజుల్లో తమ భర్తలతో మాట్లాడరు. వివస్త్రలుగానే ఇంట్లో పనులు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మగవారు కూడా మద్యం, మాంసాహారం జోలికి వెళ్లరు.

ఆగస్టు నెలలో వచ్చే ఓ పండగ సందర్భంగా పిని గ్రామ ప్రజలు ఆ విధంగా ఆచారాన్ని నిష్ఠగా పాటిస్తుంటారు. అలా చేయకపోతే అరిష్టమనీ కీడు జరుగుతుందనీ నమ్ముతారు. ఆ కీడు వారితోపాటు గ్రామానికీ చుట్టుకుంటుందని భావిస్తారు.

ఇలా చేయడానికి అక్కడ ఓ కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే... పూర్వం ఆ ప్రాంతంలో రాక్షసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ చిత్రహింసలు పెడుతుండేవారట. ఆ సమయంలో లాహుఘోండ్‌ అనే దేవత వచ్చి రాక్షసులను మట్టుపెట్టి ప్రజల్ని కాపాడిందని చెబుతారు. ఆ దేవత విజయానికి గుర్తుగానే అక్కడ ఐదురోజుల పండగను ఈ విధంగా జరుపుకొంటున్నారట పిని గ్రామస్థులు.

For All Latest Updates

TAGGED:

eenadu

ABOUT THE AUTHOR

...view details