తెలంగాణ

telangana

ETV Bharat / city

వైభవంగా మహిళా దినోత్సవ సంబురాలు - trs womens day celebrations

Womens Day Celebrations in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా తెరాస పార్టీ ఆధ్వర్యంలో మహిళా బంధు పేరిట... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి కేటీఆర్​ పిలుపుతో మూడు రోజులుగా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు. అటు కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు వేడుకలను నిర్వహించాయి.

womens day celebrations
womens day celebrations

By

Published : Mar 8, 2022, 8:08 PM IST

Womens Day Celebrations in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రమ, పరిశ్రమ మహిళలదే కావాలని నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగాఎదగాలని మంత్రి కేటీఆర్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగిన మహిళా దినోత్సవాలకు కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ , అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా ఉన్నామని పేర్కొన్నారు.

40 మంది మహిళలకు సత్కారం

మహిశా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రవీంద్రభారతిలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాఠోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 40 మంది మహిళలను సత్కరించి... అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారం అందజేశారు.

అంగన్‌వాడీ ఉద్యోగులతో కవిత

మహిళల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని...సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి నీళ్లిచ్చి మహిళల నీటి కష్టాలు తీర్చిన మహానుభావుడు ముఖ్య మంత్రి కేసీఆర్ అని.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత... అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

డ్యాన్స్​ చేసిన దానం

హైదరాబాద్ జలగం వెంగళరావు పార్కులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. కూకట్​పల్లి నియోజక వర్గంలో కరోనా వేళ సేవలు అందించిన పలువురు వైద్యులు, ఆశా వర్కర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులను... ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సత్కరించారు.

అధికారం ఇస్తే ఆరు నెలల్లోగా

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పాటుపడుతుందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే.. ఆరు నెలల్లోగా చట్టసభలలో మహిళల రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేస్తామని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనూ మహిళా దినోత్సవ వేడుకల్ని వైభవంగా నిర్వహించారు.

జిల్లాల్లోనూ వైభవంగా

జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ... అంతర్జాతీయ మహిళాదినోత్సవేడుకలు సందడిగా సాగాయి. ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులను.. ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ... పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు.

ఇదీ చదవండి :రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details