హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్య(డిస్టెన్స్ ఎడ్యుకేషన్) విభాగంలో గ్రీన్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, ఆధ్యాత్మిక గురు మాత సహస్ర శివశక్తి, గ్రీన్ ఇండియా సొసైటీ ఛైర్మన్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉస్మానియాలో మహిళామణుల సంబరాలు - osmania university
ఉస్మానియా యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళా మణులంతా కలిసి కేక్ కట్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఉస్మానియాలో అంబరాన్నంటిన మహిళా మణుల సంబరాలు
మహిళలను చైతన్యం చేయడానికి సంస్థ ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గ్రీన్ ఇండియా సొసైటీ ఛైర్మపర్సన్ జ్యోతి పేర్కొన్నారు. మహిళా సేవా కార్యక్రమాల్లో పాల్గొని వారి అభ్యుత్నతికి కృషి చేసినవారికి ఈ సందర్భంగా బహుమతులు ప్రధానం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రంగాలకు చేందిన ప్రముఖ మహిళా మణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:సినిమాలో విలన్లు ఐఫోన్ అందుకే వాడరట
TAGGED:
ప్రముఖ మహిళా మణులు