Women's Day 2022: విజయవంతమైన హీరోగా నిలవడానికి తన భార్య సురేఖనే కారణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మహిళా దినోత్సవం నిర్వహించారు. సినీ పరిశ్రమలోని మహిళలకు చిరంజీవి దంపతులు సన్మానం చేశారు. సినిమాలపై దృష్టి పెట్టడంలో తన భార్య సహకారం ఎంతో ఉందని మెగాస్టార్ తెలిపారు. తాను మహిళల పక్షపాతిగా ఉండడానికి మరో కారణం కూడా సురేఖనే అని వివరించారు. ఒక ఇంటి ఆడపడుచు మరోచోట ప్రధాన బాధ్యత వహిస్తుందని తెలిపిన చిరు.. మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదుగుతున్నారని అభినందించారు.
విజయవంతమైన హీరోగా నిలవడానికి కారణం నా భార్య: చిరంజీవి - చిరంజీవి బ్లడ్ బ్యాంకు
Women's Day 2022: హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమలోని మహిళలకు చిరంజీవి దంపతులు సన్మానం చేశారు. మహిళా కార్మికులకు చిరంజీవి సతీమణి సురేఖ చీరలు పంపిణీ చేశారు. సినిమాలపై దృష్టి పెట్టడంలో తన భార్య సహకారం ఎంతో ఉందని చిరంజీవి వివరించారు.

Women's Day Celebration at Chiranjeevi Blood Bank
విజయవంతమైన హీరోగా నిలవడానికి కారణం నా భార్య: చిరంజీవి
"ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా నిలవడానికి కారణం నా భార్య సురేఖ. సినిమాలపై దృష్టి పెట్టడంలో నా భార్య సహకారం ఎంతో ఉంది. నేను మహిళల పక్షపాతిగా ఉండడానికి మరో కారణం కూడా సురేఖ. ఒక ఇంటి ఆడపడుచు మరోచోట ప్రధాన బాధ్యత వహిస్తుంది. మహిళలు చంద్రమండలం, ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతున్నారు. మహిళలు ఉన్నతస్థాయులకు ఎదగడం గొప్ప విషయం. మహిళల సాధికారత కోసం అందరూ కృషిచేయాలి. ఇంట్లో అమ్మ, సోదరి సాధికారత కోసం కృషిచేయాలి. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి." - చిరంజీవి, నటుడు
ఇదీ చూడండి: