చుక్క దొరుకుతుంటే.. క్యూలైన్ ఓ లెక్కా?: మందుభామలు
చుక్క దొరుకుతుంటే.. క్యూలైన్ ఓ లెక్కా?: మందుభామలు - women at liquor shops in hyderabad
హైదరాబాద్ హైటెక్ సిటీ కొత్తగూడ క్రాస్ రోడ్లోని ఓ మద్యం దుకాణం వద్ద రద్దీ నెలకొంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో గత 44 రోజులుగా లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. పబ్బులు, బార్లు తెరుచుకోలేదు. దీంతో ముఖ్యంగా పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే యువతీ యువకులు మద్యం కోసం పరితపించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో యువతులు క్యూ లైన్లలో బారులు తీరారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్టన్ల కొద్దీ మద్యం కొనుగోలు చేశారు. మందుబాబులకు మేమేం తీసిపోం అంటున్నారు ఈ హైటెక్ మందుభామలు.

చుక్క దొరుకుతుంటే.. క్యూలైన్ ఓ లెక్కా?: మందుభామలు