వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. యువకునికి వేరే యువతితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ప్రేమికురాలు.. సరిగ్గా వివాహ సమయానికి అక్కడికి చేరుకుని నిలిపి వేయించింది. ఈ ఘటనకు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా మాలకొండలోని లక్ష్మీనృసింహుని దేవస్థానం వేదికైంది.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మహేశ్ అనే యువకుడు.. అదే నగరానికి చెందిన ఓ యువతి కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుని తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో అతనికి కనిగిరికి చెందిన ఓ యువతితో వివాహం చేసేందుకు నిశ్చయించారు. వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ దేవస్థానంలో వివాహానికి శనివారం ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు వధూవరుల బంధుమిత్రులు ఆలయానికి చేరుకున్నారు.