Lady Riders in Hyderabad : రైడింగ్ గర్ల్స్ రాక్స్.. సొసైటీ షాక్స్ - హైదరాబాద్‌లో లేడీ రైడర్స్
ఏంటీ నువ్వు బైక్ నడుపుతావా..? ఎక్కడైనా పడితే..? ఏ కాలో చేయో విరిగితే నిన్నెవరు పెళ్లిచేసుకుంటారు? వామ్మో.. బైక్‌పై సోలో ట్రావెలింగా? ఇంకేమైనా ఉందా? ఇవీ.. అమ్మాయిలు బైక్ నడుపుతామంటే ఎదురయ్యే కొన్ని ప్రశ్నలు. ఇంకా చాలా ఉన్నాయండోయ్. ఇలాంటి ప్రశ్నలను పట్టించుకోకుండా.. తాము అనుకున్నది చేస్తూ.. తమకు నచ్చినట్లుగా బైక్ రైడింగ్‌ను ప్యాషన్‌గా ఎంచుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. మరి ఆ రైడింగ్ గర్ల్స్ ఎదుర్కొంటున్న సవాళ్లు.. వాళ్లు చేసిన క్రేజీ రైడ్స్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం..
బైక్ రైడింగ్‌ను అభిరుచిగా ఎంచుకుంటూ.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. యువకులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు కొంతమంది యువతులు. భిన్నరంగాల్లో కెరీర్‌ను విజయవతంగా సాగిస్తూ.. బైక్ రైడింగ్‌నే ప్యాషన్‌గా ఎంచుకుంటున్నారు. సోలో, లాంగ్, నైట్ రైడ్ల్ చేస్తూ సరికొత్త సవాళ్లు స్వీకరిస్తున్నారు. హైవే ఐనా, ఘాట్ రోడ్ ఐనా.. రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నారు. అమ్మాయిలు బైక్ నడపడం ఏంటి..? సోలో ట్రావెల్స్ చేయడమేంటి..? హేవీ సీసీలు గల బైక్‌లు నడపడం సాధ్యమేనా..? ట్రావెల్ చేసే అమ్మాయిలకు తరచూ ఎదురయ్యే ప్రశ్నలు. వీటన్నింటికి తమ రైడింగ్‌తోనే సమాధానమిస్తున్నారు ఈ బృందం. రాయల్ ఎన్‌ఫీల్డ్ చేపట్టిన ఓవర్ నైట్ విమెన్ మోటార్ సైకిల్ రైడ్‌లో భాగస్వాములైన రైడింగ్ గర్ల్స్ చెబుతున్న సంగతులేంటో ఇప్పుడు చూద్దాం...
- ఇదీ చదవండి :ఆపదలో నిట్టూర్పు.. అది చాల్లే వీరికి పిలుపు