తెలంగాణ

telangana

ETV Bharat / city

తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు - land issues at machavaram

ఏపీలోని గుంటూరు జిల్లా మాచవరం తహసీల్దార్ కార్యాలయానికి మహిళా రైతు తాళం వేసింది. మే 11న పొలం కొలతల కోసం అర్జీ పెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు తాళం తీయనని భీష్మించుకుని కూర్చుంది.

తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు
తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు

By

Published : Dec 31, 2020, 7:06 PM IST

గుంటూరు జిల్లా మాచవరం తహసీల్దార్ కార్యాలయానికి ఓ మహిళా రైతు తాళం వేసింది. డీటీ, ఇతర రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయం లోపలే ఉండిపోయారు.

మే 11న పొలం కొలతల కోసం లక్ష్మమ్మ అనే మహిళ అర్జీ పెట్టుకుంది. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా... ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రకారం తన భూమిని క్షేత్రస్థాయిలో చూపాలంటూ లక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు తాళం తీయనని గట్టిగా చెబుతోంది.

తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు

ఇవీచూడండి:గర్భవతి చేసి వదిలేశావని నిలదీస్తే.. హెచ్​ఆర్సీలోనే కొట్టాడు!

ABOUT THE AUTHOR

...view details