ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మండపేటలో చాలా మంది మహిళలు తమ కుమార్తెలతో కలిసి నాట్యం నేర్చుకుంటున్నారు. వాళ్లతో కలిసి పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.
హేమలతకు... చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఇష్టం. ఇప్పుడు తన కూతురు లిఖితాంజలికి కూడా నృత్యకళలో శిక్షణ ఇప్పించారు. కుమార్తెతో కలిసి ప్రదర్శనలివ్వడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.
గీత... తన కుమార్తె షాలిన్ రోజాకు నాలుగేళ్లుగా నాట్యంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆ క్రమంలోనే గీత కూడా నాట్యం నేర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నృత్య ప్రదర్శనలిస్తున్నారు.
భవాని... చిన్నప్పటి నుంచీ నాట్యం అంటే ఇష్టం. తన ఇద్దరు కుమార్తెలకు కూడా కూచిపూడి, భరతనాట్యం వంటి జానపద నృత్యాలు నేర్పించారు. ఇప్పుడు ముగ్గురూ కలిసి ప్రదర్శనలిస్తున్నారు. మండపేటకే చెందిన సంపత్ దేవ్ వీరందరికీ శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. తల్లీకుమార్తెలు కలిసి ఒకే వేదికపై ప్రదర్శనలివ్వడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి:కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు-15 మంది మృతి