ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఏరియా హాస్పిటల్లో కనీసం ఆక్సిజన్ సదుపాయం లేక శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించడంతో... 65 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. 4 రోజుల క్రితం ఆక్సిజన్ నిల్వలు ఖాళీ కాగా... అప్పటినుంచి ఆసుత్రిలో ప్రాణవాయువు కొరత ఏర్పడింది.
ఆక్సిజన్ ఖాళీ.. ఊపిరి కోసం పోరాడుతూ మహిళ మృతి - krishna district news
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు ఖాళీ అవడంతో... ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిల్వలు అయిపోయి నాలుగు రోజులు గడవడం వల్ల.. ఆక్సిజన్ అందుబాటులో లేక బాధితురాలు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది.

కృష్ణా జిల్లాలో ఆక్సిజన్ అందక మహిళ మృతి
మృతురాలిని అవనిగడ్డ ఆసుపత్రి నుంచి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా.. వాహనం అందుబాటులో లేకపోవడం కూడా మరణానికి మరో కారణంగా తెలుస్తోంది. ఆక్సిజన్ లేక మరణం నమోదు కావడంపై స్పందించిన అవనిగడ్డ నియోజకవర్గం శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు సొంత ఖర్చుతో 10 ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో కొవిడ్ నోడల్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ కృష్ణా జిల్లా కలెక్టర్కు ఆక్సిజన్ ఏర్పాటు కోసం లేఖ రాశారు.
ఇవీ చదవండి:ఆ గూడెంలో 200 జనాభా.. 56 మందికి కరోనా