గీతా ఆర్ట్స్ ముందు జూనియర్ ఆర్టిస్ట్ సునీత మరోసారి ఆందోళనకు దిగింది. ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలిచిన సునీత.. మరోసారి గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు మళ్లీ నిరసనకు దిగింది. నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడంటూ.. గేటు ముందు బైఠాయించింది. కార్యాలయ సిబ్బంది హామీ ఇచ్చినా వినకుండా.. అక్కడే బీష్మించుకు కూర్చింది. పోలీసులు వచ్చి ఎంతగా నచ్చజెప్పినా లాభలేకపోయింది. గేటు పట్టుకుని వదలకుండా.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.
గతంలో కూడా నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని.. సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఫిలిం ఛాంబర్ వద్ద సునీత నిరసన వ్యక్తం చేసింది. క్యాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్నారంటూ.. బన్నీవాసుతో పాటు కత్తిమహేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. గతేడాది గీతాఆర్ట్స్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసి హల్చల్ చేసింది. అప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగాలేదని తెలిపారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స సైతం అందించారు.