Soda Scooty : ఎండాకాలంలో బాగా గిరాకీ వేటికి ఉంటుందంటే వెంటనే గుర్తొచ్చేది సోడా.. ఎండ వేడిమికి తాళలేక చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టంగా సేవిస్తారు. అయితే ఎక్కువ మంది రోడ్ల పక్కన తోపుడు బండ్లు పెడుతుంటారు. కానీ మనం ఇక్కడ చూసే బండి వినూత్నంగా ఉంటుంది. అవునండీ ఎందుకంటే స్కూటీకి నిమ్మసోడా బండిని పెట్టుకొని వ్యాపారం చేసుకుంటోంది ఓ మహిళ.
Video viral : బండెనక బండి కట్టి.. స్కూటీకి సోడా బండి కట్టి - soda scooty in AP
ఆలోచన ఉండాలే కానీ.. చేసేందుకు ఎన్నో పనులుంటాయి... సంపాదించేందుకు అనేక మార్గాలు దొరుకుతాయి. చాలామంది దొరికిన పని చేస్తూ జీవితం గడుపుతుంటే.. కొంతమంది మాత్రం విభిన్నంగా ఆలోచిస్తుంటారు. సమయానుకూలంగా వ్యవహరిస్తూ... లాభాలు గడిస్తుంటారు. అంతేగాక అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుంటారు. అలా ఓ మహిళ చేసిన వినూత్న ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..?
బండెనక బండికట్టి.. సోడా బండితో రయ్యి రయ్యిమని వెళ్తున్న ఈమె కృష్ణా జిల్లా గన్నవరంలో సోడా విక్రయ వ్యాపారం చేసుకుంటుంది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో నిమ్మసోడా, కలర్ సోడాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఎండ తాకిడికి తాళలేక వాహనదారులు, ప్రజలు వీటిని సేవిస్తుంటారు. దీంతో ఈమె గన్నవరం, పొట్టిపాడు వద్ద సోడాలు విక్రయించుకుంటున్నారు. అయితే స్కూటీకి వెనుక నిమ్మసోడా బండిని కట్టుకొని వెళ్తుంటే ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. బండెనక సోడా బండి కట్టుకొని వెళ్తున్న ఈమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి :