కర్ణాటక ముఖ్యమంత్రిపై తనకున్న అభిమానాన్ని భిన్నంగా చాటుకుందో మహిళ. 'జనసేవక' కార్యక్రమంలో భాగంగా గుట్టహళ్లిలోని ఇళ్లను సందర్శించారు సీఎం బసవరాజ్ బొమ్మై. ఈ కార్యక్రమంలో ఒక ఇంటి దగ్గరకు వెళ్లగా ఆయన చేతిని అందుకున్న ఓ మహిళ ముద్దులు పెట్టింది. ఆమె ఆపకుండా బొమ్మై కుడిచేతిపై ముద్దులు పెడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతేగాక ఆయన చేతిని తన ముఖంపై ఉంచి దీవెనలు తీసుకుంది. అయితే పక్కనే ఉన్న మంత్రి అశ్వథ్ నారాయణ మహిళ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సరికాదంటూ ఆమెను వారించారు. గతంలోనూ ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టిన ఘటనలు జరిగాయి. సిద్ధరామయ్య సీఎంగా పనిచేసిన సమయంలోనూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.
viral video: సీఎం చేతిపై మహిళ ముద్దుల వర్షం - సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటక ముఖ్యమంత్రి చేతిపై ఓ మహిళ ముద్దులు పెడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 'జనసేవక' కార్యక్రమంలో భాగంగా గుట్టహళ్లిలోని ఇళ్లను సీఎం బసవరాజ్ బొమ్మై సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Woman kisses on CM's hand