తెలంగాణ

telangana

ETV Bharat / city

మార్పు చిన్నదే కానీ.. యూఎన్​వో మెచ్చుకుంది - మార్పు చిన్నదే కానీ.. యూఎన్​వో మెచ్చుకుంది

సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే కనిపిస్తాయి. కానీ ఆ మున్సిపల్​ కార్పొరేషన్​ వినూత్న ఆలోచన చేసింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లలో పురుషుల స్థానంలో మహిళల బొమ్మల్ని వినియోగంలోకి తెచ్చింది. ఇలా చేయం దేశంలో ఇదే మొదటిసారి.

woman images display on traffic Signals in bruhan mumbai municipal corporation
మార్పు చిన్నదే కానీ.. యూఎన్​వో మెచ్చుకుంది

By

Published : Aug 16, 2020, 9:29 AM IST

సాధారణంగా ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే కనిపిస్తాయి. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎమ్‌సీ) నగరంలోని దాదర్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లలో పురుషుల స్థానంలో మహిళల బొమ్మల్ని వినియోగంలోకి తెచ్చింది. ఆ ప్రాంతంలో 120 కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్లతోపాటు పాదచారుల సూచీ బోర్డులమీద కూడా ఈ మార్పులు చేసింది. దేశంలో మహిళల చిహ్నాల్ని ట్రాఫిక్‌ లైట్లలో ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఎరుపు, ఆకుపచ్చ రంగుల లైట్లలో ఈ చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ రాష్ట్ర పర్యటక మంత్రి ఆదిత్య ఠాక్రే వీటి గురించి ట్వీట్‌ చేశారు. ఈ ప్రయత్నాన్ని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం కూడా మెచ్చుకోవడం విశేషం. ‘మార్పు చిన్నదే కానీ సరైనది’ అని ఈ మార్పును ఆహ్వానించారంతా.

ABOUT THE AUTHOR

...view details