విశాఖ జిల్లా సింహాచలంలోని అడవివరం ఆరోగ్య కేంద్రంలో అమానవీయం ఘటన జరిగింది. చికిత్స కోసం వచ్చిన నిండు గర్భిణీ లక్ష్మిని.. కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు పంపించేశారు. ఫలితం కోసం నిరీక్షిస్తుండగా.. అకస్మాత్తుగా నొప్పులు పెరిగి.. కూర్చున్న చోటే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. అనంతరం ఆమెను కేజీహెచ్‌కు వెళ్లాలని చెప్పారు.
అదే తంతు: పీహెచ్సీలో సిబ్బంది నిర్లక్ష్యం... ఆస్పత్రి ఎదుటే ప్రసవం - అడవివరంలో ఆస్పత్రి ఎదుటే మహిళ ప్రసవం
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో.. పీహెచ్సీ ఎదుటే ఓ మహిళ ప్రసవించింది. ఈ ఘటన విశాఖ జిల్లా సింహాచలం అడవివరం ఆరోగ్య కేంద్రంలో జరిగింది. కరోనా పరీక్ష అనంతరమే వైద్యం చేస్తామని సిబ్బంది పంపించేయగా.. ఫలితం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నచోటే మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.
ఆస్పత్రి ఎదుటే ప్రసవం
గతంలోనూ అడవివరం ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు వచ్చినా.. వారిలో ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదని పలువురు వాపోతున్నారు. పూర్తిస్థాయి డిప్యూటీ సివిల్ సర్జన్ ఇక్కడ లేకపోవడం.. సిబ్బంది అలసత్వానికి కారణంగా చెప్పుకుంటున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ నియోజకవర్గంలో పేద గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయమైంది.
ఇదీ చదవండి:కొవిడ్ సోకిన వారందరికీ బ్లాక్ ఫంగస్ రాదు: రమేశ్‌రెడ్డి