sex change female to male: పోలీసు శాఖలో పురుషులతో పోలిస్తే మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. కానీ, ఓ మహిళా కానిస్టేబుల్.. పురుషుడిగా మారాలనుకుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. అన్ని అంశాలు పరిశీలించిన ప్రభుత్వం తాజాగా లింగ మార్పిడికి అనుమతించింది.
పురుషుడిగా మారాలనుకుంటున్న మహిళా కానిస్టేబుల్కు రాష్ట్ర హోంశాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు అదనపు చీఫ్ సెక్రటరీ(హోంశాఖ) డాక్టర్ రాజేశ్ రాజోరా తెలిపారు.
" మహిళ నుంచి పురుషుడిగా మారేందుకు ప్రభుత్వ విభాగం అనుమతించటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తన చిన్నతనం నుంచే ఆమె పురుష లక్షణాలను కలిగి ఉన్నట్లు సైకాలజిస్టులు తేల్చారు. ఈ కారణంతో ఆమెను లింగ మార్పిడి చేసుకునేందుకు హోంశాఖ అనుమతులిచ్చింది."