'ప్రపంచ వైద్యరంగంలో భారత వైద్యులదే ప్రధాన పాత్ర' - ప్రపంచ వైద్యరంగంలో భారత వైద్యులదే ప్రధాన పాత్ర
ప్రపంచ వ్యాప్తంగా వైద్య సేవలందించడంలో భారతీయ మూలాలున్న వైద్యులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఉత్తమ వైద్యం అందించే గొప్ప ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆరోగ్య కల్పన బాధ్యత ఒక్క ప్రభుత్వానిదే కాదని...ప్రైవేటు భాగస్వామ్యం చాలా అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ ఆరోగ్య సదస్సును ప్రారంభించారు. అంటువ్యాధులు విజృంభించకుండా తీసుకోవాల్సి ముందస్తు చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యులు చికిత్స అందించడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంపొందేలా అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. విదేశాల్లో ఉన్నా మాతృదేశ ఆహారపు అలవాట్లు మరిచిపోవద్దని ఉపరాష్ట్రపతి సూచించారు.
- ఇదీ చూడండి : ఉద్రిక్తతల మధ్య ట్రాన్స్జెండర్ల ప్రైడ్ పరేడ్