హైదరాబాద్ సైదాబాద్ దోబీ ఘాట్ చౌరస్తాలో శ్మశాన వాటిక స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఎస్‌వై మద్యం దుకాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. శ్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేసి వైన్ షాప్ ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ కమిషనర్‌కు స్థానికులు, శ్మశాన పరిరక్షణ సమితి సభ్యులు ఫిర్యాదు చేశారు. స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు మద్యం దుకాణాన్ని కూల్చి వేశారు.
శ్మశానవాటిక స్థలంలో వైన్ షాప్.. కూల్చివేసిన అధికారులు... - wine shop demolished in saidabad
హైదరాబాద్ సైదాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా శ్మశాన వాటిక స్థలంలో ఏర్పాటుచేసిన ఓ మద్యం దుకాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. శ్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేసి వైన్ షాప్ ఏర్పాటు చేశారని స్థానికులు ఫిర్యాదు చేయడం వల్ల స్పందించిన అధికారులు దుకాణాన్ని తొలగించారు.
wine shop
ఆ స్థలం తమ పూర్వికుల నుంచి వచ్చిందని యజమాని తెలిపాడు. కొందరు క్షక్షపూరితంగా వ్యవహరించి కావాలనే తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించాడు.
ఇదీ చూడండి: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై సిట్ కార్యాచరణ ప్రారంభం