ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి కార్యక్రమాన్ని ఓయూ జేఏసీ, తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం సంయుక్తంగా నిర్వహించింది. జేఏసీ నాయకులు బాలకృష్ణ నేత, ఆంజనేయులు నేత, రాజు నేతల సమక్షంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహాన్ని ట్యాంకబండ్పై పెట్టాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. బాపూజీ పేరిట యూనివర్సిటీ స్థాపించి పేద విద్యార్థులకు విద్య అందించాలని కోరారు. ఆయన పేరు మీద పరిశోధన కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయాలన్నారు.
'కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలి' - ఓయూ జేఏసీ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతిని హైదరాబాద్లోని ఓయూ ప్రాంగణంలో జేఏసీ నాయకులు ఘనంగా చేపట్టారు.
ఓయూ ప్రాంగణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలు