తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్తి పత్రాలిస్తావా.. కొవిడ్​ అంటించమంటావా..! - covid impact in telangana

ఆస్తి పత్రాలిస్తావా.. లేదంటే నీ ముఖంపై దగ్గమంటావా..! అసలే నాకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందంటూ మాజీ భార్య తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందని ఓ వ్యాపారి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 447, 341, 506 సెక్షన్‌ 3 ఎపిడమిక్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

wife harassed husband
wife harassed husband

By

Published : Jun 4, 2021, 7:34 AM IST

జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే సంజీవరెడ్డి(70) ఓ మహిళను(38)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు(17) ఉన్నారు. సంజీవరెడ్డి ప్రశాసన్‌నగర్‌లో ఆమె పేరిట ఓ ఇంటిని కొనుగోలు చేశారు. తరువాత ఆ మహిళ మరొకరిని వివాహం చేసుకొంది. తండ్రి, కుమారులిద్దరూ నందగిరిహిల్స్‌లో నివసిస్తున్నారు.

'ప్రశాసన్‌నగర్‌లో కొనుగోలు చేసిన ఇంటి పత్రాల కోసం గత నెల 31న ఆ మహిళ సంజీవరెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించింది. తన పేరిట ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వాలంటూ పట్టుబట్టింది. సంజీవరెడ్డిని దుర్భాషలాడింది. అంతటితో ఆగకుండా తనకు కొవిడ్‌ పాజిటివ్‌ ఉందని, ముఖంపై దగ్గి అంటిస్తానని బెదిరించింది. పలు విధాలుగా బెదిరింపులకు పాల్పడిందని..బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

స్పందించిన పోలీసులు... సదరు మహిళపై ఐపీసీ సెక్షన్‌ 447, 341, 506 సెక్షన్‌ 3 ఎపిడమిక్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:కరోనా రోగులతో డాక్టర్ల డ్యాన్స్.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details