శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం మంచాలపేటకు చెందిన షణ్ముకరావును.. ఆయన భార్య పార్వతి నడిరోడ్డు మీద కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్లడం చర్చనీయాంశమైంది. వీరికి ఇద్దరు పిల్లలుండగా.. కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన షణ్ముకరావు.. మరో మహిళను వెంట తీసుకువచ్చాడు.
మోసం చేసిన భర్త.. కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లిన భార్య
ఉపాధి కోసం వేరే ఊరు వెళ్లిన భర్త మరో మహిళను వెంటపెట్టుకొచ్చాడు. ఈ విషయంపై భార్య పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. సమస్య కొలిక్కి రాకపోవటంతో.. ఆ భర్త అక్కడనుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ఆ భార్య... అతడి కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మోసం చేసిన భర్త.. కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లిన భార్య
ఆ మహిళ... గర్భవతి కావటం వల్ల ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి పార్వతి తీసుకెళ్లింది. సమస్య అక్కడ పరిష్కారం కాకపోవటం వల్ల షణ్ముకరావు అక్కడనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పార్వతి.. గ్రామస్థుల సహకారంతో భర్త కాలర్ పట్టుకొని.. నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీసు స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది.
ఇదీ చదవండి:వైద్యులు లేని ఆస్పత్రులు.. రోగులకు తప్పని ఇబ్బందులు!