Wife Cut Off Husbands Genital: బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు యత్నించిన భర్తపై ఆగ్రహం వ్యక్తంచేసింది భార్య(24). అంతటితో ఆగకుండా ఏకంగా ఆ వ్యక్తి అంగాన్నే కోసేసింది. మధ్యప్రదేశ్లోని టీకంగఢ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ నెల ఏడో తేదీన టీకమ్గఢ్ నగరంలోని రామ్నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
భర్త మర్మాంగం కోసేసిన భార్య.. బలవంతంగా సెక్స్ చేసేందుకు యత్నించాడట..! - భర్త మర్మాంగం కోసేసిన భార్య
Wife Cut Off Husbands Genital: బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించిన భర్త అంగాన్ని కోసేసింది భార్య. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది.
ఈ మేరకు 26 ఏళ్ల బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు జాతర పోలీస్ స్టేషన్ అధికారి తివేంద్ర త్రివేదీ తెలిపారు. ' నా భార్యకు ఇష్టం లేనప్పటికీ శృంగారంలో పాల్గొనేందుకు ప్రయత్నించా. దీంతో ఆమె ఈ ఘోరానికి పాల్పడింది. ' అని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో వారికి వివాహం జరిగిందని, అనంతరం కొన్ని గొడవల కారణంగా విడిపోయిన వారు ఇటీవలే కలిసి ఉంటున్నారని చెప్పారు. "ఏడో తేదీన ఘటన జరిగినా.. శస్త్రచికిత్స చెయించుకున్నందున బాధితుడు ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. ఐసీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశాం" అని త్రివేదీ తెలిపారు.
ఇదీ చదవండి:అక్కాచెల్లెళ్లపై బంధువుల సామూహిక అత్యాచారం