తెలంగాణ

telangana

ETV Bharat / city

భార్య ఆత్మహత్య చేసుకుందని... భర్త బలవన్మరణం.. - దంపతుల బలవన్మరణం... అనాథగా మారిన పసికందు

ప్రేమించుకున్నారు.. పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.. విదేశాల్లో ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం... సాఫీగా సాగుతున్న కాపురంలో కలహం విలయం సృష్టించింది. మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా... అది తట్టుకోలేక భర్త బలవన్మరణానికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం సృష్టించింది.

దంపతుల బలవన్మరణం... అనాథగా మారిన పసికందు

By

Published : Sep 1, 2019, 8:28 AM IST

Updated : Sep 1, 2019, 8:47 AM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన శివరాత్రి రమాదేవి, మెట్టెల గంగయ్య సైన్సులో పీజీ చేశారు. విశ్వవిద్యాలయంలోనే ప్రేమించుకున్నారు. మూడేళ్ల క్రితం పెళ్లిచేసుకున్నారు. ఉద్యోగాల కోసం ఇద్దరూ సౌదీకి వెళ్లారు. రమాదేవి గర్భం దాల్చి.. ఏడాదిన్నర క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఆ తర్వాత గంగయ్యకు మంచి ఉద్యోగం రావడం వల్ల లండన్‌ వెళ్లారు. భార్యను, కుమార్తెను చూసేందుకు నెలరోజుల క్రితం స్వదేశానికి వచ్చాడు. భార్యను పీహెచ్‌డీ చేయాలంటూ సౌదీలో ఉన్నప్పటి నుంచే కోరుతున్నట్లు సమాచారం. ఆమెకు అది ఇష్టంలేక ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి.

పీహెచ్‌డీ చేస్తేనే లండన్‌ తీసుకెళ్తా....

ఇటీవల స్వగ్రామానికి వచ్చినపుడూ అతడు మరోసారి భార్యను ఒత్తిడి చేశాడని, పీహెచ్‌డీ చేస్తేనే లండన్‌ తీసుకెళ్తానని చెప్పాడని రమాదేవి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అత్త వేధింపులు కూడా తోడై తమ కుమార్తె తనువు చాలించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగయ్య ఆగస్టు 29న లండన్‌లో దిగాడు. అదేరోజు సాయంత్రం రమాదేవి స్వగ్రామంలో ఉరివేసుకుని మృతిచెందింది. విషయం తెలిసి గంగయ్య వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. హైదరాబాద్‌ చేరుకున్నా, స్వగ్రామానికి రాలేదు.

ఇంట్లో భార్య... రైల్వేస్టేషన్​ వద్ద భర్త ఆత్మహత్య

ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులకు సమాచారం వచ్చింది. మృతదేహం వద్ద లభ్యమైన ఓటర్‌, ఆధార్‌ కార్డుల ఆధారంగా మృతుడిని గంగయ్యగా గుర్తించి, మార్టూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యను కడసారి చూసేందుకు గంగయ్య వస్తాడని కుటుంబీకులు, బంధువులు ఎదురుచూస్తున్న తరుణంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తెలిసి శోకసంద్రంలో మునిగారు.

ఇవీ చూడండి: మరో జలదృశ్యం ఆవిష్కృతం

Last Updated : Sep 1, 2019, 8:47 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details