జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా కుట్ర చేశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయనే ఎన్నికలకు సమయం ఇవ్వట్లేదన్నారు. సమయం ఎక్కువ ఇస్తే ఎన్నికల్లో భాజపా గెలుస్తుందనేది వారి భయమన్న లక్ష్మణ్.. సమయం తక్కువగా ఉన్నా తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. లక్ష ఇళ్లు ఇచ్చే వరకు ఓట్లు అడిగే ప్రసక్తే లేదని గతంలో చెప్పారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నారని.. కానీ చెల్లించలేదన్నారు.
నిర్ణీత కాలవ్యవధి కంటే ముందుగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరపడం. అదీ 14 రోజుల అత్యల్ప సమయంలో పూర్తిచేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రభుత్వ వైఫల్యాలు, తెరాస, మజ్లిస్ పార్టీల దోపిడీపై ఈ ఎన్నికల్లో ఎక్కువగా చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారు. ఆర చేతిలో వైకుంఠం చూపించి పబ్బం గడుపుకున్నారు. ఎన్నికల ప్రకటన వచ్చే ఒక రోజు ముందు రాయితీలు, తాయిలాలు ప్రకటించి వారు చేసిన పాపాలను కడుక్కుందామనే వారి ప్రయత్నాన్ని హైదరాబాద్ ప్రజలు తిప్పికొడతారు.
-లక్ష్మణ్ , భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
అందుకే 14 రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు: లక్ష్మణ్ ఇవీచూడండి:గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు