తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా చికిత్స కోసం మహిళలు పుస్తెలు అమ్ముకుంటున్నారు' - batti vikramarka latest press meet

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. కరోనా చికిత్స కోసం మహిళలు పుస్తెలు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉంటే ప్రజలు బ్లాక్‌లో ఎందుకు కొంటున్నారని నిలదీశారు.

bhatti vikramarka
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కramarka

By

Published : May 5, 2021, 5:35 PM IST

Updated : May 5, 2021, 6:56 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కొవిడ్‌ నివారణకు అన్నీ ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అన్నీ ఉన్నట్లయితే ప్రతి రోజు ఇంత మంది ప్రజలు ఎలా చనిపోతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాధ్యత గల స్థానంలో ఉన్న సీఎస్‌ ఇన్ని అబద్ధాలు ఎలా చెబుతారని నిలదీశారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగాలేదని, చికిత్స కోసం మహిళలు పుస్తెలు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

'కరోనా చికిత్స కోసం మహిళలు పుస్తెలు అమ్ముకుంటున్నారు'

రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉంటే ప్రజలు ఎందుకు బ్లాక్‌లో కొంటున్నారని భట్టి ప్రశ్నించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దానిని ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం...అది ఏమి చేస్తోందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ దేశంలో ఎప్పటి నుంచో వ్యాక్సిన్లు ఉచితంగానే వేస్తున్నారని చెప్పుకొచ్చారు. గిరిజనులు, నిరక్షరాస్యులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగలరా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉంటే ప్రజలు బ్లాక్‌లో ఎందుకు కొంటున్నారని నిలదీశారు. సీఎం నాలుగు గోడల మధ్య నుంచి బయటకు రావాలని భట్టి డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: పీసీసీ ఎంపికతో పాటు తాజా రాజకీయాలపై చర్చ

Last Updated : May 5, 2021, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details