తెలంగాణ

telangana

ETV Bharat / city

Bandi Sanjay on Tickets: 'నాకే టికెట్‌ వస్తుందో లేదో తెలియదు' ​ - bandi sanjay on bjp

Bandi Sanjay on Tickets: పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని అన్నారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Apr 12, 2022, 4:57 PM IST

Bandi Sanjay on Tickets: భాజపాలో ముఖ్యమంత్రులవుతామని చెప్పుకునే వారు సీఎంలు కాలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ తన టికెట్‌పై కూడా స్పష్టత లేదని ఖరాఖండిగా చెప్పారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. యూపీ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకున్న వారికి టికెట్‌ రాలేదని సంజయ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్లని స్పష్టం చేశారు.

వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు బండి సంజయ్​ రావన్నారు. టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు తిప్పుకుంటున్నారని.. అలా తిప్పుకున్న వారికి తిరిగిన వారికి ఇద్దరికీ సీట్లు రావని తేల్చి చెప్పారు. భాజపా జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కూడా ఇదే విషయం చెప్పారని బండి సంజయ్​ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పనిచేస్తున్నారని తెలిపారు.

అంతకు ముందు... పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్​ సమావేశమయ్యారు. ఈనెల 14 నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా స్కెచ్ వేసినట్లు తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ధమయ్యామన్నారు. రైతుల ముసుగులో తెరాస దాడులు చేసినా భాజపా కార్యకర్తలు, నాయకులంతా ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని కోరారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని, తెరాస ప్రభుత్వ నియంత, అవినీతి, కుటుంబ పాలనను ఎండగడతామని పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి :'కేసీఆర్​ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం.. కులవృత్తులు నిర్వీర్యం'

ABOUT THE AUTHOR

...view details