తెలంగాణ

telangana

ETV Bharat / city

దుబ్బాక అభ్యర్థి విషయంలో రేపు నిర్ణయం తీసుకుంటాం: ఉత్తమ్‌ - congress candidate in dubbaka byelections 2020

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలో దిగే అభ్యర్థి విషయంలో మంగళవారం రోజు నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపికపై సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

who is the congress candidate in dubbaka byelections 2020
దుబ్బాక ఉపఎన్నికపై కాంగ్రెస్ నిర్ణయం

By

Published : Oct 5, 2020, 2:30 PM IST

Updated : Oct 5, 2020, 4:30 PM IST

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో పోటీ చేయనున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని మంగళవారం ప్రకటించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. దుబ్బాక అభ్యర్థిత్వంపై ఇంకా పార్టీలో చర్చ జరుగుతోందని.. రేపటికి ఒక కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు.

చెరకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించిన ఉత్తమ్‌.. తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో మద్దతు కోరుతూ తమను తెజస అధ్యక్షుడు కోదండరాం సంప్రదించారని.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే....ప్రజాస్వామ్య విలువలు మరింత మెరుగవుతాయని అనుకున్నామని.. కానీ కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. తెరాస.. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిందని.. రాజకీయ విలువలను దిగజారుస్తోందని ధ్వజమెత్తారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి తనయ కవిత.. కరోనా పరిస్థితులను మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. పార్టీల సమావేశాలు పెట్టొద్దని అందరికి చెబుతూనే.. తెరాస మాత్రం అన్నీ చేస్తోందని విమర్శించారు. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల నేతలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి కవితను అనర్హురాలిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

Last Updated : Oct 5, 2020, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details