రాష్ట్రంలో లాక్డౌన్ విజయవంతం చేసేందుకు రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. అత్యవసర విధులు నిర్వర్తించే వారికి సంబంధించినవి తప్ప మిగతా ఏ వాహనాలు వచ్చినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.
అనవసరంగా రోడ్డుమీదకొస్తే వాహనాలు సీజ్ - రవాణాశాఖ అధికారుల చర్యలు
లాక్డౌన్ అమలుకు రవాణాశాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 330 వాహనాలు సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
![అనవసరంగా రోడ్డుమీదకొస్తే వాహనాలు సీజ్ who come out without reason their vehicles seized by rta officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6532920-thumbnail-3x2-aksdfj.jpg)
అనవసరంగా రోడ్డుమీదకొస్తే వాహనాలు సీజ్
లాక్డౌన్ అమలైన మొదటి రోజున రాష్ట్రవ్యాప్తంగా 300 వాహనాలు సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఈ రోజు వాహనాల సీజ్ తగ్గినట్టు వివరించారు. ఇవాళ కేవలం 30 వాహనాలపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికైనా మేల్కొని ఇంటి వద్దనే ఉండాలని సంయుక్త రవాణాశాఖ అధికారి పాపారావు విజ్ఞప్తి చేశారు.
అనవసరంగా రోడ్డుమీదకొస్తే వాహనాలు సీజ్
ఇదీ చూడండి:'21 రోజుల నిర్బంధం... ప్రాణాలకన్నా ఎక్కువేం కాదు'