ఫార్మా సిటీ వెనక ఉన్న ప్రజాప్రయోజనాలు ఏంటని ప్రభుత్వాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 8 వేల ఎకరాలను బలవంతంగా రైతుల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. కార్పొరేట్, విదేశీ కంపెనీలకు భూములు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. పేదల నుంచి భూములు లాక్కొని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
ఫార్మా సిటీ వల్ల సమీప భూములు, జలాలు కలుషితం అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను తెరాస ప్రభుత్వం లాక్కుంటోంది. పేదల వద్ద అతి తక్కువకు భూములు తీసుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఎక్కువ ధరకు విక్రయించుకునే కుట్ర జరుగుతోంది.