తెలంగాణ

telangana

ETV Bharat / city

Notices to Ayyanna: అయ్యన్న ఇంటికి పోలీసులు.. ఎందుకంటే ?

Notices to Ayyanna: ఏపీ సీఎం జగన్​ను అసభ్య పదజాలంతో దూషించారన్న కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడుకి నోటీసులు ఇచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు విశాఖలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయ్యన్న ఇంట్లో లేరని తెదేపా కార్యకర్తలు చెప్పినా.. పోలీసులు వినిపించుకోకుండా భారీగా మోహరించారు.

Notices to Ayyanna
అయ్యన్న పాత్రుడికి నోటీసులు

By

Published : Feb 23, 2022, 12:43 PM IST

Notices to Ayyanna: ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల నుంచి సీఐ రఘు, ఎస్‌ఐలు శ్రీహరిరావు, అవినాష్‌తో పాటు పోలీసు సిబ్బంది వచ్చారు. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరని చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. అయ్యన్న ఇంట్లో ఉన్నారని.. బయటికి వస్తే నోటీసులు ఇచ్చి వెళ్లిపోతామని అన్నారు.

నోటీసులు ఎందుకంటే..

ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు... ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నాయకుడు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నల్లజెర్ల పోలీసులు అయ్యన్నపాత్రుడిపై 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:TRS Deeksha for Bayyaram Steel plant : 'బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు..'

ABOUT THE AUTHOR

...view details