మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు(rains in ap) కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
weather update: రాగల 24 గంటల్లో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు - telangana news
మహారాష్ట్రలోని విదర్భతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఏపీలో మోస్తరు వర్షాలు(ap rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. వచ్చేవారం రోజుల పాటు కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.

ఏపీలో వర్షాలు, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు
తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో.. ఒకటీ రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చేవారం రోజుల పాటు.. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.
ఇదీ చదవండి: దారుణం: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు