TS Weather Report: ఇప్పటికే వర్షాలతో తడిసి ముద్దవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ తగలనుంది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
బీ అలర్ట్.. మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు..!
TS Weather Report: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తద్వారా రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ నివేదిక
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అదే ప్రదేశంలో కొనసాగుతుందన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉందన్నారు. కావున ఇది రానున్న 24గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని వాయువ్య దిశగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకునే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 10, 2022, 4:10 PM IST