రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు.. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు - తెలంగాణ వాతవరణ వార్తలు
ఒడిశా తీరంతోపాటు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు.. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
rain
బుధవారం వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, జనగామ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఒడిశా తీరంతోపాటు దాని పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు..