ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీలోని అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. ప్రస్తతం ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
RAIN ALERT: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో వర్షాలు - ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉపరితన ఆవర్తనం కొనసాగుతోందని ఏపీలోని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
weather report in ap
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాయల సీమ జిల్లాల్లో రేపటి నుంచి కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.
ఇదీ చూడండి: Viral Video: వ్యాక్సిన్ వేసుకోనని మొండికేసిన వ్యక్తి.. అందరూ కలిసి ఏం చేశారంటే..?