రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం, శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి.
బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ 11 గంటల వ్యవధిలోనే పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కోటగిరి(నిజామాబాద్ జిల్లా)లో 13.6 సెంటీమీటర్లు, పెద్దూరు(రాజన్న)లో 9, రామారెడ్డి(కామారెడ్డి)లో 8.2, అవునూరు(రాజన్న)లో 7.4, మర్రిపల్లిగూడెం(హనుమకొండ)లో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.