ఏపీ సర్కార్‌పై తెదేపా విషప్రచారం చేస్తోందంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం(sajjala comments on chandrababu news ) చేశారు. ఎక్కడ ఏం జరిగినా సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో డ్రగ్స్ సరఫరా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ అంశంపై సీబీఐ, డీఆర్ఐ విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు.
Sajjala: 'చంద్రబాబు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం'
ఇటీవల ఏపీ సీఎం జగన్‌ఫై చంద్రబాబు చేసిన ఆరోపణలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని.. ఏపీ ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీలో డ్రగ్స్ సరఫరా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Sajjala
వైకాపా అధికారంలోకి వచ్చాక ఏపీలో 2.5 లక్షల కిలోల గంజాయి పట్టుకున్నామని సజ్జల వెల్లడించారు. ఆధారాలు లేకుండా తెదేపా నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాండోరా పత్రాల్లో(pandora papers news) జగన్ పేరు ఉండొచ్చన్న వ్యాఖ్యలు దారుణమన్నారు. చంద్రబాబు చేసిన ఈ ఆరోపణల(chandrababu allegations against cm jagan)పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి:kcr clarify on 3 acres to dalits: దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు: సీఎం